![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -212 లో..... ధీరజ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే.. సాగర్, చందు వచ్చి మాట్లాడతారు. నాన్న ఇలా మాటలు పడడానికి కారణం ప్రేమ అని ప్రేమపై కోపంగా ఉంటాడు ధీరజ్. ఆ తర్వాత రామరాజు బాధపడుతుంటే వేదవతి వెళ్లి నేను కావాలని నగలు విషయం చెప్పకుండా లేను.. అలాగే ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తుందని నాకు తెలియదని వేదవతి అంటుంది.
వద్దు ఇక ఏం చెప్పకు.. ఏం నమ్మలేను.. ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏం జరగదనుకున్నా కానీ నా ఇంటి గురించి నాకే తెలియదని రామరాజు బాధపడతాడు. నాతో మాట్లాడండి అని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. కాస్త సమయం పడుతుందని రామరాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధీరజ్ కి సారీ చెప్తుంది ప్రేమ. ఇంకా ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు.ఇంట్లో జరిగిన గొడవకి శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతూ డ్యాన్స్ చేస్తుంది.
ఆ తర్వాత సాగర్ దగ్గరికి నర్మద వస్తుంది. నువ్వు నన్ను మోసం చేసావ్. ప్రేమ డ్యాన్స్ క్లాస్ కి వెళ్తున్న విషయం నీకు తెలుసు కానీ నాకు చెప్పలేదని నర్మదతో సాగర్ గొడవ పెట్టుకుంటాడు.. ఆ తర్వాత ధీరజ్, సాగర్ బయట పడుకుంటారు. చందు వాళ్లిద్దరి దగ్గరికి వస్తుంటే వద్దని శ్రీవల్లి అపుతుంది. తరువాయి భాగంలో వేదవతిని నర్మద, ప్రేమ కూల్ చెయ్యాలని ట్రై చేస్తారు. మీ వల్ల ఆయన నన్ను అన్ని మాటలు అన్నారు.. అసలు ప్రేమ అలా తయారు అవ్వడానికి కారణం నర్మద అని వేదవతి అనగానే నర్మద షాక్ అవుతుంది. అదంతా శ్రీవల్లి వింటు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |